లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు

లక్ష కోట్లకు వారసుడు..  2 రూములున్న ఇంట్ల  ఉంటున్నడు

కోటీశ్వరుల కొడుకులు లగ్జరీగా బతికేస్తారని అనుకుంటం. కానీ అందరు బిలియనీర్లు అలా ఉండరు. కొందరు వాళ్ల కొడుకులు కింది నుంచి పైకి రావాలని కోరుకుంటరు. కష్టమంటె ఎట్లుంటదో, ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎట్ల సముదాయించుకోవాలో, ఎట్ల పని చేయాల్నో, ఉద్యోగులతో ఎట్ల పని చేయించుకోవాల్నో సొంతంగా తెలుసుకోవాలని పరీక్షలు పెడుతుంటరు. అట్లాంటిదే రష్యాకు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు కథ. ఈయన తండ్రి మైకేల్‌‌ ఫ్రీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రష్యాలో బిలియనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సుమారు లక్ష కోట్ల ఆస్తుంది. రష్యాలో 11వ స్థానంలో ఉన్న కోటీశ్వరుడు. కానీ కొడుకును మాత్రం సొంతంగా బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకొని పెద్దోడిగా ఎదగమని చెప్పాడు. మనోడూ సరేనన్నడు. బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ చదివొచ్చాక 5 నెలల కిందట మాస్కో శివారులో ఓ రెండు రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.35 వేలకు రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు

ఐదుగురు ఉద్యోగులతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత రెండో కంపెనీని మొదలుపెట్టాడు. వచ్చే నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అడుగుపెట్టబోతున్నాడు. ప్రతి పనిలో తనకు పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే వాళ్లని తండ్రి చెబుతుండేవారని, సంపాదించాలంటే షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని అంటుండేవారని అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. ఆస్తినంతా చారిటీకి ఇచ్చేస్తానని తండ్రి చెప్పాడని, కాబట్టి తనకు తండ్రి నుంచి ఎలాంటి ఆస్తి రాదని తెలిపాడు. తన తండ్రికి చెందిన రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులతో పాటు వేరే షాపులకూ తాము డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని చెప్పాడు.సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టెర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలనుకున్నానని, కానీ ఓ యేడాది గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యానన్నాడు.