బిలియనీర్​తో పూరీ హీరోయిన్​పెళ్లి

బిలియనీర్​తో పూరీ హీరోయిన్​పెళ్లి

దర్శకుడు పూరి జగన్నాథ్​ టాలీవుడ్​కి పరిచయం చేసిన హీరోయిన్లలో అదితి ఆర్య ఒకరు. 2015 ఫెమినా మిస్​ ఇండియా టైటిల్​ని గెలుచుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్​ సినిమాల్లోనూ నటించింది. 2016లో వచ్చిన కళ్యాణ్​రామ్ ఇజం.. సెవెన్, నిన్ను వదిలి నేను పోలేనులే వంటి సినిమాల్లోనూ చేసింది.  తాజాగా కోటక్​ మహీంద్రా సంస్థల అధినేత ఉదయ్​ కోటక్​ కుమారుడు జై కోటక్​ అదితిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు.

‘అదితి నాకు కాబోయే భార్య.. ఈ రోజు యేల్​ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. నాకు చాలా గర్వంగా ఉంది’ అంటూ ఆమె గ్రాడ్యేయేషన్​ డే ఫొటోలను పోస్ట్​ చేశాడు. జై ప్రస్తుతం కోటక్​ 811 కి వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్నాడు. ఈ ట్వీట్​ పై పలువురు ప్రముఖులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మొత్తానికి బిలియనీర్​నే పట్టేశావంటూ నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు. 

https://twitter.com/jay_kotakone/status/1661394414000828422