ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు

ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు
  • కరీంనగర్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో వీరే ఎక్కువ
  • అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థి అంజిరెడ్డి  
  • సెకండ్​ ప్లేస్​లో మల్క కొమురయ్య 
  • థర్డ్ ప్లేస్​లో ఆల్ఫోర్స్ నరేందర్​రెడ్డి

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువగా కోటీశ్వరులే ఉన్నారు. వీరిలో పది మందికిపైగా ఉండగా.. ఫస్ట్ ప్లేసులో బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ చిన్నమైల్ అంజిరెడ్డి( రూ.175 కోట్లు), సెకండ్ ప్లేస్ లో అదే పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య (రూ.61 కోట్లు) ఉన్నారు. థర్డ్ ప్లేసులో కాంగ్రెస్‌‌ టీచర్స్​ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌‌ రెడ్డి (రూ.45.50 కోట్లు) ఉన్నారు. 

ఫస్ట్ ప్లేసులో చిన్నమైల్‌‌ అంజిరెడ్డి 

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్‌‌ అంజిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అందరి కంటే ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయన పేరిట రూ.120.40 కోట్లు, ఆయన భార్య పేరిట రూ.54.79 కోట్ల స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. ఇద్దరి ఆస్తులు కలిపి రూ.175 కోట్లుగా అఫిడవిట్​లో తెలిపారు. అంజిరెడ్డి భార్యకు రూ.1.43 కోట్ల విలువైన 1,850 గ్రాములు ఆభరణాలు ఉన్నట్లు చూపించారు.

విద్యా సంస్థల అధినేత మల్క కొమురయ్య 

హైదరాబాద్‌‌లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మల్క కొమురయ్య బీజేపీ నుంచి టీచర్స్‌‌ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయన పేరిట రూ.32 . 08 కోట్లు, ఆయన భార్య పేరిట రూ. 29. 55 కోట్ల స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. దంపతులిద్దరి ఆస్తులు రూ. 61. 63 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. కొమురయ్య భార్యకు 4 కిలోల 457 గ్రాముల బంగారం ఉన్నట్టు వాటి విలువ రూ.17. 93 కోట్లుగా పేర్కొన్నారు.
 

‘ఆల్ఫోర్స్‌‌’ నరేందర్ రెడ్డి 

కరీంనగర్‌‌కు చెందిన కాంగ్రెస్‌‌ అభ్యర్థి ‘ఆల్ఫోర్స్‌‌’ నరేందర్‌‌ రెడ్డి పేరిట రూ.30 కోట్లు, ఆయన భార్య పేరిట రూ.13.38 కోట్ల స్థిర, చర ఆస్తులు తెలిపారు. దంపతుల పేరిట ఉమ్మడి ఆస్తులు మరో రూ. 2 కోట్లతో కలిపి మొత్తం రూ.45.50 కోట్లుగా చూపించారు. నరేందర్ రెడ్డి భార్య పేరిట క్రిస్టా కారు, అర కిలో బంగారం ఉన్నట్లు అపిడఫిట్ లో పేర్కొన్నారు.  

పీఆర్టీయూ క్యాండిడేట్ మహేందర్ రెడ్డి 

టీచర్స్‌‌ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన పీఆర్‌‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌‌ రెడ్డి పేరిట రూ. 1. 19 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడిచారు. ఆయన కుటుంబం పేరిట మొత్తం రూ. 20.48 కోట్లు ఉన్నట్టు చూపారు.  

బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 

బీఎస్పీ నుంచి గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ గా బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా రిజైన్ చేశారు. ఆయన ఆస్తులు రూ. 49.07 లక్షలు కాగా, ఆయన భార్య పేరిట రూ. 2.16 కోట్లు ఉన్నట్టు, దంపతులిద్దరివి రూ.2.65 కోట్లుగా చూపించారు.  ఆయన భార్యపై 300 గ్రాముల బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. సర్దార్‌‌ రవీందర్‌‌ సింగ్‌‌ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మేయర్‌‌ సర్దార్​రవీందర్ ​సింగ్​చరాస్తులు రూ.1.10 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ. 73,81,000గా అఫిడవిట్ లో చూపించారు.