Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు.

Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు.

చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram).తన కెరీర్లో మంచి సినిమాలు చేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం వరుస పరాజయాలు వెంటాడాయి.ఇక కళ్యాణ్ రామ్ పని అయిపోతుందని అనుకునేలోపే..తనకి నటుడిగా పునర్జన్మనిచ్చిన సినిమా ‘బింబిసార’(Bimbisara).ఇది కళ్యాణ్ రామ్ సినిమా ప్రపంచానికి ప్రాణం పోసింది.ఈ సినిమా సెకండ్ లాక్‌‌‌‌డౌన్ టైంలో రిలీజై సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి ఆశలు కలిగించింది.అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది.

తాజా విషయానికి వస్తే..ఇవాళ (జూలై 5న) కల్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ‘బింబిసార ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. "బింబిసార కంటే ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన లెజెండ్ కథను చూడటానికి సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మరో థ్రిల్లింగ్ మూవీతో కళ్యాణ్ రామ్ తమ ఫ్యాన్స్ ను అలరించడం కన్ఫమ్ అనిపిస్తుంది. అయితే  బింబిసార ప్రీక్వెల్ కి మాత్రం డైరెక్టర్ మారాడు. ఈ బింబిసార ప్రీక్వెల్ కు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నాడు. బింబిసారను తెరకెక్కించిన మల్లిడి వశిష్ట్ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తుండటంతో డైరెక్టర్ మారినట్లు తెలుస్తోంది. కానీ, ఈ ప్రీక్వెల్ కి సంబంధించిన కథ ఏంటనేది మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.ఆకాష్ పూరి 'రొమాంటిక్'సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ పాడూరి బింబిసార ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు

బింబిసార కథేమిటంటే..

త్రిగర్తలను పాలించే బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరమ క్రూరుడు. అతని నిలువెల్లా అహంకారమే. తనకి నచ్చినట్టు పాలిస్తాడు. ఎదురు తిరిగినవారి ప్రాణం తీసేస్తాడు. ప్రజల కష్టాలు పట్టవు. ఎదుటివారి కన్నీళ్లు కూడా అతనిని కరిగించలేవు. చివరిఇక తన సొంత తమ్ముడైన దేవదత్తుడిని కూడా చంపేయాలనుకుంటాడు. కానీ తృటిలో తప్పించుకున్న దేవదత్తుడు.. ఓ మాయా దర్పణం సాయంతో బింబిసారుణ్ని మాయం చేసి, అతని స్థానంలో సింహాసనమెక్కుతాడు. ఇటు దర్పణం కారణంగా నాటి త్రిగర్తల నుంచి నేటి కాలానికి వచ్చి పడతాడు బింబిసారుడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాటిని అతనెలా ఫేస్ చేశాడు, తిరిగి తన రాజ్యానికి వెళ్లాడా లేదా అనేది మిగతా కథ.