ఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్‌డేట్

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హత్యకు గురైన యువతి, యువకుడిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. యువకుడిని మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్‌, యువతిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు(25)గా గుర్తించారు. తాజాగా బయటపడిన విషయం ఏమిటంటే.. హత్య కాబడిన బిందు ముచ్చటగా ముగ్గురితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తేలింది. 

మృతురాలు బిందు.. భర్తతో కలిసి ఎల్బీ నగర్‎లో ఉంటుంది. ఈమెకు ముగ్గురు పిల్లలు. భర్తకు తెలియకుండా నానక్ రామ్ గూడకు చెందిన సాకేత్‌తో ప్రేమాయణం సాగిస్తున్న మృతురాలు.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు బయటపడింది. ఈ నెల 8వ తేదీన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా.. మృతురాలి భర్త తన భార్య కనిపించడం లేదంటూ వనస్థలిపరంలో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ALSO READ | నార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?

అదే సమయంలో తన తమ్ముడు కనిపించడంలేదంటూ అంకిత్ సాకేత్‌ సోదరుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. దాంతో గచ్చిబౌలి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే వీరి హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.