జిల్లాల బులెటిన్ లో ఒక లెక్క.. స్టేట్ బులెటిన్ లో మరో లెక్క
30% కేసులే వెల్లడిస్తున్న రాష్ట్ర సర్కారు..
మరణాల్లోనూ ఇదే మతలబు
ఖమ్మంలో వారంలో 3,548 కేసులు .. 1,003 కేసులే నమోదైనట్లు స్టేట్ ప్రకటన
గ్రేటర్ లో రోజూ 1,500లకు పైగా కేసులొస్తే బులెటిన్ లో చెప్పేది 500 లోపే
హైదరాబాద్, వెలుగు: కరోనాను కంట్రోల్ చేసినమని చెప్పుకునేందుకు సర్కార్ దొడ్డిదారిని ఎంచుకుంది. వైరస్‌ను కంట్రోల్ చేయలేక కేసులను దాచిపెడుతూ తక్కువగా చూపుతోంది. కేవలం 30 శాతం కేసులనే బయటకు వెల్లడిస్తూ , మిగిలిన 70 శాతం కేసులను దాస్తోంది. ఖమ్మం జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 3,548 కేసులు నమోదైనట్టు ఆ జిల్లా అధికారులు చె బుతుంటే.. కేవలం 1,003 కేసులు మాత్రమే నమోదైనట్టు స్టేట్ బులెటిన్ లో ప్రకటించారు. నల్గొండలో 3వేల కేసులు వస్తే… 1,078 కేసులే ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో 2,208 కేసులకు బదులు 575 కేసులే చూపించారు. ఇలా ప్రతి జిల్లాలోనూ భారీగా కేసులు దాస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు 1,500 లకు పైగా కేసులు నమోదవుతుంటే, 500 లోపే వస్తున్నట్టు చూపుతున్నారు. కేసులు తక్కువ చూపిస్తూ కరోనాను కంట్రోల్ చేసినమని, సెప్టెంబర్ లో పూర్తిగా కంట్రోల్ లోకి వస్తదని చెబుతున్నారు. అసలు లెక్కలు బయట పడకుండా ఉండేందుకు జిల్లాల వారీగా నమోదైన కేసులను బయటపెట్టట్లేదు. జిల్లాల్లో అధికారికంగా బులెటిన్ ఇవ్వొద్దని ఆదేశాలిచ్చా రు. అయినా ఇంటర్నల్‌గా రెడీ చేసే జిల్లా బులెటిన్లు బయటకు వస్తూనే ఉన్నాయి. స్టేట్ బులెటిన్ లో ఇచ్చే లెక్కలు చూసి జిల్లా ఆఫీసర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే దాస్తున్నరు…
కరోనాను కంట్రోల్ చేసేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ము ఖ్య మని ఐసీఎంఆర్ , డబ్ల్యూ హెచ్ వో మొదట్నుంచి చెబుతున్నాయి. కానీ రా ష్ర్టంలో ఏప్రిల్ నుంచే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయడం ఆపేశారు. జులై వరకూ అరకొరగానే టెస్టులు చేశారు. ఇప్పటి వరకు 15.42 లక్షల టెస్టులు చేస్తే, ఇందులో ఆగస్టులోనే సు మారు 11 లక్షల టెస్టులు చేశారు. జులై వరకు సింప్టమాటిక్, ఎసింప్టమాటిక్ వ్యక్తు లంతా టెస్టుల కోసం తిరగాల్సి వచ్చింది. దీంతో వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించింది. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం.. కేంద్రం, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో టెస్టులను పెంచారు. దీంతో కేసులూ పెరిగాయి. ప్రస్తుతం రోజూ 9 వేల మందికి పాజిటివ్ వస్తోంది. కానీ 3 వేల కంటే తక్కువ కేసులే నమోదవుతున్నట్టు బులెటిన్లో ఇస్తున్ నారు. పెద్ద మొత్తంలో కేసులు వస్తున్నట్టు చూపితే విమర్శలు వస్తా యనే ఉద్దేశంతోనే కరోనా కేసులను దాచేస్తున్ నారు.
2.5 లక్షలకు చేరువలో కేసులు
దేశంలో అత్యంత తక్కువ టెస్టులు చేసిన రాష్ర్టంగా, అత్యంత ఎక్కువ పాజిటివ్ రేట్ ఉన్న రాష్ర్టంగా తెలంగాణ రికార్డులకు ఎక్కింది. టెస్టుల సంఖ్య పెరిగినా పాజిటివ్ రేట్ లో ఇప్పటికీ మనమే టాప్‌లో ఉన్నాం. రా ష్ర్టంలో ఇప్పటి వరకు 15,42,978 టెస్టులు చేశామని.. అందు లో 1,33,406 మందికే పాజిటివ్ వచ్చిందని సర్కార్ చెప్పుకుంటోంది. కానీ కేసుల సంఖ్య ఇప్పటికే 2.5 లక్షలకు చేరువైనట్టు సమాచారం. ఇందులో గ్రేటర్ పరిధిలో 1.4 లక్షలకు పైగా నమోదైనట్టు తెలిసింది. ప్రభుత్వ లెక్క ప్రకారం పాజిటివ్ రేట్ 8.64 శా తంగా ఉంది. కానీ టెస్టులు చేయించుకుంటు న్న ప్రతి వంద మందిలో 20 మందికి పాజిటివ్ వస్తోం దని క్షేత్రస్థాయి డాక్టర్లు చెబుతున్నారు. గ్రేటర్ లో ఇప్పటికీ 25 నుంచి 30 శాతం పాజిటివ్ రేట్ ఉన్నట్టు ప్రైవేట్ ల్ యాబ్ ల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
గాంధీలోనే రోజుకు 35 డెత్స్
రాష్ట్రంలో మే నుంచే కరోనా మరణాలను దాస్తున్నారు. రోజు 10 మంది లోపే మరణిస్తున్నట్టు బులెటిన్ లో చూపిస్తూ .. ప్రపంచంలో ఎక్కడా లేనంత తక్కువగా డెత్ రేట్ నమోదవుతోందని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి ఒక్క గాంధీ హాస్పిటల్‌లోనే సగటున రోజుకు 35 మందికి పైగా చనిపోతున్నట్టు అక్కడి డాక్టర్లు, సిబ్బందే చెబుతున్నారు. ఇక కరోనా ట్రీట్ మెంట్ అందిస్తున్న 170 ప్రైవేట్ హాస్పిటళ్లు, 42 ప్రభుత్వ దవాఖాన్లలో ఇంకెంత మంది చనిపోతున్నారో లెక్కే లేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 856 మందే చనిపోయినట్టు సర్కారు చెబుతున్నా సంఖ్య వేలల్లో ఉంటుందని డాక్టర్లు, ఆఫీసర్లు అంటున్నారు.