తాను.. త్రిష ప్రియుడ్ని ప్రేమించిన మాట వాస్తవమే కానీ.. తాను, త్రిష ఒకేసారి వరుణ్‌ని ప్రేమించలేదని క్రేజీ కామెంట్స్ చేసింది టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి. తాను ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ "న్యూసెన్స్". నవదీప్ హీరోగా వస్తున్న ఈ సిరీస్ ని శ్రీ ప్రవీణ్ కుమార్ తెరకెక్కించాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ మే 12 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఇందులో భాగంగా.. బిందు మాధవికి ఊహించని ప్రశ్న ఎదురైంది. త్రిష ప్రియుడ్ని మీరు ప్రేమించారా? అని ఓ జర్నలిస్ట్ డైరెక్ట్ గా అడిగేసింది. ఆ ప్రశ్న విని షాక్ కి గురైన బిందు.. అందులో కొంత నిజం, కొంత అబద్ధమని ఉందని సమాధానం ఇచ్చింది. తాను త్రిష ప్రియుడ్ని ప్రేమించిన మాట నిజమేనని, అయితే.. తాను, త్రిష ఒకేసారి వరుణ్‌ని ప్రేమించలేదని, వాళ్లిద్దరు విడిపోయాకే తాను వరుణ్‌కి దగ్గర అయ్యానని క్లారిటీ ఇచ్చింది కానీ.. వీరి లవ్ కూడా ఎందుకు బ్రేకప్ అయింది అనేది మాత్రం బిందు రివీల్ చేయలేదు.
అయితే.. కొంతకాలం క్రితం బిందు మాధవితో, వరుణ్ మణియన్ ప్రేమలో పడ్డాడని ప్రచారం జరిగింది. వాళ్లిద్దరు కలిసి వెకేషన్స్‌కి, పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలు లీక్ అవ్వడంతో వారి మధ్య ఏదో నడుస్తోంది అనే వార్తలకి బలం చేకూరింది. ఇంతలో ఏమైందో తెలీదు కానీ.. వీరి ప్రేమ కూడా మధ్యలోనే బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం బిందు మాధవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.