తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా నటి బిందుమాధవి నిలిచింది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో మొట్టమొదటి సారి మహిళా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ విజేత ను ప్రకటించారు. ఇక మరోసారి అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచాడు.
ట్రోఫీని అందుకున్న అనంతరం బిందుమాధవి ఎమోషనల్ అయ్యింది. ఓటు చేసిన వాళ్లకు, చేయని వాళ్లకూ, తనను ఆదరించిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పింది. తన జీవితంలో సక్సెస్ చాలా లేటుగా వచ్చిందని తెలిపింది. ఎన్నో ఏళ్లు కష్టపడ్డా విజయం రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫిబ్రవరి 26 న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ 84 రోజుల పాటు సాగింది. మొత్తం 18 మంది పాల్గొన్నారు. చివరకు బిందు మాధవి టైటిల్ గెలిచింది. శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో టాప్ 7 కంటెస్ట్ గా బాబా బాస్కర్, అనీల్ రాథోడ్, మిత్రాశర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్ బిందుమాధవి ఉన్నారు. వీరిలో అనీల్ రాథోడ్,మిత్రాశర్మ, బాబా భాస్కర్ ఎలిమినేషన్ అయ్యారు.. అరియానా రూ.10 లక్షలతో వెళ్లిపోయింది. తర్వాత శివ ఎలిమినేట్ అయ్యాడు. చివరకు అఖిల్, బిందుమాధవి టాప్ 2 కంటెస్టెంట్స్ గా మిగలడంతో స్టేజ్ పైన నాగార్జున బిందుమాధవిని విన్నర్ గా ప్రకటించారు .