కరీంనగర్ సిటీ, వెలుగు: రైతు ఆదాయం పెరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుందని ఎంఎస్‌పీ కమిటీ సభ్యులు, రైతు సంఘం జాతీయ నాయకులు పాషా పటేల్, బినోద్ ఆనంద్ అన్నారు. సోమవారం కరీంనగర్ సిటీలోని పద్మనాయక కల్యాణ మండపంలో కిసాన్ జాగరణ్‌సంస్థ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్‌రావు అధ్యకతన గ్రామీణ కిసాన్మేళా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న మేళాను ఎంఎస్‌పీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్వ్యవసాయక దేశమైనప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుగుణాకర్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో నిర్వహించే మేళాలకు గ్రామాల నుంచి రైతులు హాజరుకాలేరని, అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా కరీంనగర్‌లో నిర్వహిస్తున్నామన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్..
కిసాన్ గ్రామీణ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ఆకర్షణగా నిలిచాయి. విత్తన స్టాల్స్, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆధునిక వాహనాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. వరి, పత్తి, మక్కజొన్న, మిరప, కూరగాయలకు సంబంధించిన స్టాల్స్ కిక్కిరిసిపోయాయి.