ఓయూలో బయో గ్యాస్ ప్లాంట్ ప్రారంభం

ఓయూలో బయో గ్యాస్ ప్లాంట్ ప్రారంభం

ఓయూ, వెలుగు : ఘన వ్యర్థాల నిర్వహణలో ఓయూ ముందడుగు వేసింది. వర్సిటీ ప్రాంగణం, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను ప్రాసెస్​చేసి బయోగ్యాస్​తీసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్​ను ఓయూ వీసీ  కుమార్ సోమవారం ప్రారంభించారు. కేపీఎంజీ, అహుజా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన నిధులు, ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలోని సాహస్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళా హాస్టల్ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటు చేశా రు.

ఇక నుంచి రోజుకి 2 టన్నుల ఆహార వ్యర్థాలను బయోగ్యాస్‌‌గా మార్చనున్నారు. ఈ ప్లాంట్​పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తే రోజుకు 6 నుంచి 8 వంటగ్యాస్ సిలిండర్లకు సమానమైన గ్యాస్‌‌ను ఉత్పత్తి చేయొచ్చు. దీంతో 20 హాస్టళ్లలో వంటగ్యాస్, కట్టెలకు అయ్యే ఖర్చు ఆదా కానుంది. ప్రారంభ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేశ్​రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్రకుమార్ నాయక్‌‌, జీవ వైవిధ్య, పరిరక్షణ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, మహిళా హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణలక్ష్మి, చీఫ్‌‌ వార్డెన్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.