వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్నాలకుగాను ఈ అవార్డు వరించింది. ఈ పక్షిజాతి జనాభా ఈశాన్య భారతదేశంలో 450కి తగ్గడంతో వీటిని సంరక్షించేందుకు, కొంగల నివాసాల(వీటి గూళ్లు)ను రక్షించడానికి స్థానిక కమ్యూనిటీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె ప్రోత్సహిస్తుంది. ఈ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో జీవ వైవిధ్యత, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టే వారికి వైట్లీ ఫండ్​ ఫర్​ నేచర్​(డబ్ల్యూఎఫ్​ఎన్​) సంస్థ వైట్లీ గోల్డ్​ అవార్డుతోపాటు లక్ష గ్రేట్​ బ్రిటన్ పౌండ్లను నగదు బహుతిని అందజేస్తుంది. 

గ్రేటర్​ అడ్జటెంట్​ కొంగ 

సికోనిడే కుటుంబానికి చెందిన ఈ పక్షుల్లో సుమారు 20 రకాల జాతులు ఉన్నాయి. ఇవి పొడవాటి మెడను కలిగి ఉంటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయాసియాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచంలో అంతిరించిపోతున్న జాతుల్లో ఈ కొంగ జాతి కూడా ఒకటి. కంబోడియా, భారతదేశంలో (అసోం, బిహార్​)లలో మాత్రమే సంతోన్పత్తి ప్రదేశాలు ఉన్నాయి.