- ఎస్సారెస్పీ కెనాల్, చెరువులోకి చేరుతున్న వేస్టేజ్ వాటర్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఎంసీహెచ్ హాస్పిటల్‌లో బయో మెడికల్ వెస్టేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం నిరుపయోగంగా ఉంది. దీంతో డ్రైనేజీ పైప్ లైన్ ద్వారా నేరుగా బయటకు వదిలేస్తున్నారు. 2022లో ఎంసీహెచ్‌లో బయో మెడికల్ వేస్టేజ్‌మెంట్ సిస్టంను ప్రారంభించారు. కానీ అప్పటినుంచి వినియోగంలోకి తీసుకురాలేదు. ఎంసీహెచ్‌లో నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. డెలీవరీల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చే ఉమ్మ నీరు, ల్యాబ్‌ల్లో టెస్టింగ్‌లకు ఇచ్చే షాంపిల్స్.. తదితర వెస్టేజ్ వాటర్‌ను బయో మెడికల్ వెస్టేజ్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో శుద్ధి చేయాలి.
ఆ తర్వాత ఆ నీటిని బయటకు వదలాలి. కాగా ఈ ప్లాంట్ పనిచేయకపోవడంతో డైరెక్ట్‌గా వెస్టేజ్ వాటర్‌ను వదులుతున్నారు. ఈ నీరంతా ఎస్సారెస్పీ డీ61 కెనాల్ లోకి వెళ్లేలా కందకాలు తీశారు. ఈ కెనాల్ నీరు నేరుగా ముప్పారపు చెరువులోకి వెళ్తుంది. దీంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై
జగిత్యాల ఎంసీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సుమన్ మాట్లాడుతూ జగిత్యాల ఎంసీహెచ్‌లో వేస్టేజ్ వెళ్లే దగ్గర డ్రైనేజ్ సమస్య ఉందని, ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించామన్నారు. మరో 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.