డ్యూటీకి రాకున్నా అటెండెన్స్.. జీహెచ్ఎంసీలో భారీ కుంభకోణం

జీహెచ్ఎంసీ(GHMC) లో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతోంది. ప్రతినెలా  కోట్లు కాజేస్తున్నారు మెడికల్ ఆఫీసర్లు, శానిటేషన్ సూపర్ వైజర్లు. కార్మికులు డ్యూటీకి రాకున్నా.. అటెండెన్స్ వేసి నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ తీసుకొచ్చినా అవినీతి దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.  చార్మినార్,  కుత్బుల్లాపూర్, గోషామహల్ లో ఈ అక్రమాలు బయటపడ్డాయి.

200 కోట్ల స్కాం

గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 19 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో దాదాపు రెండు వేల మంది కార్మికులు ఫేస్ రికగ్నిషన్ చేసుకోలేదు. ఫేస్ రికగ్నిషన్ చేసుకున్న  17 వేల మందిలో కూడా రోజు 12 వేల మందిలోపే విధులకు హాజరవుతున్నారు.  సింథటిక్ వేలిముద్రలతో చనిపోయిన కార్మికుల పేరుతో ఎస్ఎప్ఏలు జీతాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు . జీహెచ్ఎంసీలో లేని కార్మికులకు దాదాపు పదేళ్లుగా వేతనాలు చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దాదాపు రూ.200 కోట్ల స్కాం జరిగినట్లు ఇటీవల తేల్చారు అధికారులు.  

 ఫేస్ రికగ్నైజ్ యాప్ తో అటెండెన్స్ వేయించి నిధులు కాజేస్తున్నారు సూపర్ వైజర్లు. వికారారాబాద్ చార్మినార్,  కుత్బుల్లాపూర్, గోషామహల్ ఈ అక్రమాలు బయటపడ్డాయి. దాదాపు 1570 మంది బోగస్ కార్మికులు ఉన్నట్లు తేల్చారు అధికారులు. దీంతో భారీగా నిధులు పక్కదారిపట్టినట్లు గుర్తించారు.