సింగరేణిలో బయోమెట్రిక్‌‌ సిస్టం షురూ

గోదావరిఖని, వెలుగు :  సింగరేణికి చెందిన జీఎం ఆఫీస్‌‌, డిపార్ట్‌‌మెంట్లు,  హాస్పిటల్‌‌లో డ్యూటీ చేసే ఆఫీసర్లు, ఉద్యోగులకు బయోమెట్రిక్‌‌ సిస్టంలో అటెండెన్స్​ నమోదు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.  కరోనాతో నిలిచిపోయిన ఈ సిస్టమ్‌‌ను తిరిగి ఆర్జీ 1 ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌‌ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ సీహెచ్ లక్ష్మి నారాయణ, ఎన్విరాన్ మెంట్ ఆఫీసర్‌‌ ఆంజనేయ ప్రసాద్, ఐటీ మేనేజర్ రాజేశ్​తదితరులు పాల్గొన్నారు.