
హైదరాబాద్, వెలుగు: కరోనా మెడిసిన్స్ తయారీలో వాడే ఇంటర్మీడియేట్ మెడిసిన్ నిర్మత్రల్‌విర్‌ను డెవలప్ చేశామని, తయారీని స్టార్ట్ చేశామని ఫార్మా కంపెనీ బయోఫోర్ ప్రకటించింది. ఈ ఇంటర్మీడియేట్ మెడిసిన్‌ను కరోనా థెరపీ పాక్స్‌లోవిడ్‌లో వాడుతున్నారు. ఈ ఇంటర్మీడియెట్ మెడిసిన్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి ఎమెర్జెన్సీ అప్రూవల్స్ వచ్చాయని కంపెనీ ప్రకటించింది. ఈ మెడిసిన్‌ను రక్షిత్ గ్రూప్‌తో కలిసి తయారు చేస్తామని పేర్కొంది. మెడిసిన్‌లలో వాడే ఇంటర్మీడియేట్‌ల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది. తాజాగా డెవలప్‌చేసిన నిర్మత్రల్‌విర్‌తో ఇలా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఇంటర్మీడియేట్ మెడిసిన్‌ను సొంతంగా తయారు చేస్తామని కూడా కంపెనీ ప్రకటించింది. డీసీజీఐ అప్రూవల్స్ కోసం త్వరలో అప్లయ్ చేస్తామని పేర్కొంది.