ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం జూన్ క్వార్టర్లో వార్షికంగా 10శాతం పెరిగి రూ.1,703 కోట్లకు చేరింది. గత ఏడాది జూన్క్వార్టర్లో రూ.1,551 కోట్ల లాభం వచ్చింది. నిర్వహణ లాభం రూ.3,752 కోట్ల నుంచి రూ.3,677 కోట్లకు తగ్గింది.
నికర ఎన్పీఏలు రూ.8,118 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు.. అంటే 30శాతం తగ్గాయి. గ్లోబల్ బిజినెస్ రూ.12,14,808 కోట్ల నుంచి రూ.13,64,660 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 6శాతం పెరిగింది. తాజా క్వార్టర్లో రూ.6,275 కోట్లు వచ్చాయి. బ్యాంక్ మొత్తం క్యాపిటల్ అడిక్వసీ రేషియో 58 బేసిస్ పాయింట్లు పెరిగి 16.18శాతం వద్ద ఉంది.