హసన్ పర్తి,వెలుగు : హసన్ పర్తి మండల కేంద్రంలో బీరప్ప బోనాలు బుధవారం వైభవంగా జరిగాయి. గొల్ల కురుమలు డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ .. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కోరిన కోర్కెలు తీర్చాలని, నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు.
కార్యక్రమంలో గొల్ల కురుమ పెద్దమనుషులు కోరే కుమారస్వామి, కాలే యాదగిరి ,బక్కయ్య, పెద్దరాజు, దాడి చిరంజీవి, మారం సదానందం వేల్పుల సదానందం, వేల్పుల రమేశ్, దాడి వెంకటయ్య పాల్గొన్నారు