
నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో సుమారు 7 వేల కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ సోకి ఉండవచ్చునని గ్రామస్తులలో ఆందోళన నెలకొంది. చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడిక తీసి పాతి పెట్టారు రైతులు.
ఫారంలో గత కొన్ని రోజులుగా వ్యాధికి గురైన కోళ్లకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి డాక్టర్లను పిలిపించారు రైతులు. పలుమార్లు వచ్చి వైద్యం అందించినా ఫలితం లేకపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3 లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలిపారు.
ALSO READ | హైదరాబాద్ లో అప్పుడే మొదలైన నీటి కష్టాలు.. ఫిబ్రవరిలోనే అడుగంటిన గ్రౌండ్ వాటర్ లెవెల్స్..
హైదరాబాద్ జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించారని, కారణం ఏంటో చెప్పలేదని రైతులు తెలిపారు. రేయింబవళ్లు కష్టపడి పెంచిన కోళ్లు చనిపోవడంతో తీవ్ర నష్టం వాటిళ్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రీమియం కంపెనీలు ఆదుకోవాలని అభ్యర్తించారు.