- నైట్ అడవిలో స్టే, ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటన
కాగజ్‌నగర్, వెలుగు : కాగజ్‌నగర్ పరిధిలోని పెంచికల్‌పేట్ అడవుల్లో శనివారం సాయంత్రం ప్రారంభమైన బర్డ్ వాక్, నేచర్ ట్రయల్ ప్రోగ్రామ్ ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. శనివారం రాత్రి అడవిలోనే గడిపిన పక్షి ప్రేమికులు ఆదివారం ఉదయం వివిధ రకాల పక్షుల్ని, పరిసర ప్రాంతాలను తమ కెమెరాల్లో బంధించారు. ఎల్లూర్ చెరువు, కుశపల్లి అడవి, గుండేపల్లి బేస్ క్యాంప్, పాలరాపు గుట్ట, దరిగాన్, కోసిని రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించారు.
బర్డ్‌వాక్‌కు హాజరైన వారికి అడవిలోని ప్రత్యేకతలు, విశేషాలను ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది వివరించారు. యూత్, మహిళలు, చిన్నారులతో పాటు ఆరు పదుల వయసులో ఉన్న వారు సైతం బర్డ్‌వాక్‌కు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ బోబడే, ఫీల్డ్ బయాలజిస్ట్ ఎల్లం, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రాజేశ్ కన్నీ పాల్గొన్నారు.