కాగజ్ నగర్ అడవుల్లో బర్డ్ వాక్ ఫెస్టివల్ సందడి

బర్డ్ వాక్ ఫెస్టివల్​తో కాగజ్ నగర్ డివిజన్ అడవులు సందడిగా మారాయి. పక్షి ప్రేమికులు పెద్ద పెద్ద కెమెరాలతో అడవుల్లో సంచరించే పక్షుల్ని, అందమైన లొకేషన్స్​ను చిత్రీకరించారు. యూత్​తో పాటు ఆరు పదుల వయసున్నవారు కూడా అటవీ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ బిజీబిజీగా గడిపారు. ఆ ఫొటోలను చూసి మురిసిపోయారు.

Also Read :- అర్హులందరికీ రేషన్ కార్డులు

 వారికి తోడుగా ఫారెస్ట్ సిబ్బంది, ఆఫీసర్లు వెంట ఉన్నారు. అడవుల్లోని ప్రత్యేకతలు, విశేషాలను బర్డ్​వాకర్స్​కు వివరించారు. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తనిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగజ్ నగర్, వెలుగు