ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బర్డ్ వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. కాగజ్ నగర్ డివిజన్లోని సిర్పూర్ టీ, పెంచికల్ పేట్, కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ అడవుల్లో పలు నీటి చెరువులు, రిజర్వాయర్‌లో దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోగ్రాఫర్లు ప్రకృతి అందాలను చిత్రీకరించారు. అరుదైన పక్షులను కెమెరాల్లో బంధించారు. అడవుల్లోని ప్రత్యేకతలు, విశేషాలను ఫారెస్ట్ సిబ్బంది , ఆఫీసర్లు వారికి వివరించారు.
అనంతరం వేంపల్లి టింబర్ డిపోలో ముగింపు కార్యక్రమం నిర్వహించి బర్డ్ వాక్‌లో పాల్గొన్న వారికి డీఎఫ్‌వో నీరజ్ కుమార్, ఎఫ్‌డీవో సుశాంత్ సర్టిఫికెట్లు అందించారు. అయితే మూడు రోజుల పాటు అనుకున్న బర్డ్ వాక్.. అటవీ అధికారుల నిర్లక్ష్యం, ప్రచారం లేక పెద్దగా లేకపోవడంతో పక్షి ప్రేమికులు భారీగా పాల్గొనకపోవడంతో రెండ్రోజుల్లోనే ముగిసింది. - కాగజ్ నగర్, వెలుగు