- 4న సాయంత్రం ప్రారంభమై 5న మధ్యాహ్నం ముగియనున్న ప్రోగ్రామ్
జన్నారం రూరల్, వెలుగు : కవ్వాల్ టైగగ్ జోన్ పరిధిలో ఈ నెల 4, 5 తేదీల్లో సెకండ్ ఫేజ్ బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల నుంచి సైతం బర్డ్ లవర్స్, ఫొటోగ్రాఫర్లు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. బర్డ్‌వాక్‌లో భాగంగా 15 మందిని ఒక్కో గ్రూపుగా చేసి 4.30 గంటలకు గనిశెట్టి కుంట వద్దకు తీసుకెళ్లనున్నారు. అక్కడ పక్షులను చూసిన తర్వాత రాత్రి 7.30కి ఇంటరాక్షన్, డిస్కషన్ ఉంటుంది. 9 గంటలకు డిన్నర్ చేసి, అక్కడే ఏర్పాటు చేసిన టెంట్లలో పడుకోవాలి. 5న ఉదయం 5.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బర్డ్‌వాచ్ ఉంటుంది.
ఉదయం 8.30కి బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. 11.30కి ఫీడ్ బ్యాక్, ర్యాప్‌అప్ సెషన్ ఉండనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జన్నారంలో లంచ్ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. బర్డ్‌వాక్‌లో పాల్గొనేవారు ఈ నెల 4న సాయంత్రం నాలుగు గంటలకు జన్నారంలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌కు చేరుకొని రూ. 2 వేలు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎఫ్‌ఆర్‌వో సుష్మారావు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం కిష్టాపూర్ ఎఫ్‌బీవో (85000 04086), ఇతర వివరాలకు జన్నారం ఎఫ్‌ఆర్‌వో (99895 91096), ఇందన్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో (96183 57086)ను సంప్రదించాలని సూచించారు.