జన్నారం రూరల్, వెలుగు : జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ టైగర్ జోన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధి గనిశెట్టికుంట, మైసమ్మకుంట ఏరియాల్లో రెండు రోజులు నిర్వహించి న బర్డ్ వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. భారీగా తరలివచ్చి బర్డ్స్ లవర్స్ శనివారం సాయంత్రం పక్షులను తిలకించారు. రాత్రి అక్కడే క్యాంప్ ఫైర్ వద్ద బస చేసి ఆదివారం ఉదయం మళ్లీ బర్డ్ వాక్ కు వెళ్లారు.
ఉడ్పికర్, కింగ్ఫిషర్, బ్లాక్ హెడ్ ఈగల్, అడవి బాతులు, అడవి కోళ్లు, చిలుకలు, ఫిషింగ్ ఈగల్స్, కార్న్ హెరాల్డ్, పారాకిట్, మునియా, కొర్మోన్ట్ వంటి అరుదైన పక్షులను చూసి పరవశించిపోయారు. తమ సెల్ ఫోన్లలో, కెమెరాల్లో బంధించారు. బర్డ్ వాక్ ఫెస్టివల్ మరపురాని అనుభూతిని మిగిల్చిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. పర్యాటకులకు జన్నారం, ఇందన్పల్లి రేంజ్ ఆఫీసర్లు సుష్మారావు, శ్రీనివాస్ ఏర్పాట్లను చేశారు.