దేశంలో కరోనా భయం తగ్గకముందే.. తాజాగా బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. మొదట పక్షులకు, ఆ తర్వాత మనుషులకు సోకి ప్రాణాలు తీసే ఈ జబ్బు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు పాకింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోకి కూడా ఈ జబ్బు ఎంటరైంది. దాంతో బర్డ్‌ఫ్లూ బారినపడ్డ రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో శనివారం ఒక్కరోజే 1200 పక్షులు మృత్యువాత పడ్డాయి. దాంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చిరించింది. ఈ జబ్బు మనుషులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
For More News..