ప్రధాని మోదీ, బీరేన్ సింగ్ మణిపూర్ను విభజించాలని కుట్ర చేశారు:రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, బీరేన్ సింగ్ మణిపూర్ను విభజించాలని కుట్ర చేశారు:రాహుల్ గాంధీ

మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.రెండేళ్లుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జాతి హింసకు బీరేన్ సింగ్ కారణమయ్యారని విమర్శించారు. ప్రధాని మోదీతో కలిసి మణిపూర్ ను విభజించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. మైథి, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస 250 మంది ప్రాణాలు తీసిందన్నారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. 

ALSO READ | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

తీవ్రహింస, ప్రాణనష్టం జరుగుతున్నా.. మణిపూర్ సీఎం గా బీరేన్ సింగ్ కొనసాగిస్తూ ప్రధాని మోదీ అల్లర్లకు ఆజ్యం పోశారని అన్నారు. దాదాపు రెండేళ్లపాటు బీరేన్ సింగ్ మణీపూర్ లో విభజన రాజకీయాలు చేశారని ఆరోపించారు. అల్లర్లకు ఆజ్యం పోసిన బీరేన్ సింగ్ ను  ప్రధాని మోదీ ప్రోత్సహించారని మండిపడ్డారు.  ప్రజల ఒత్తిడి, సుప్రీంకోర్టు విచారణ, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం భయంతో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్దపడ్డాడని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

మణిపూర్ లో తక్షణమే శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో స్పష్టం చేశారు. శాంతని పునరుద్దరించి మణిపూర్ ప్రజల గాయాలను మాన్పడం తక్షణ ప్రాధాన్యత అన్నారు. ప్రధాని మోదీ వెంటనే మణిపూర్ లో పర్యటించారు. ప్రజల గోడును వినాలి. అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాహుల్ గాంధీ X(ట్వీట్టర్)లో పోస్ట్ చేశారు.