యాదగిరిగుట్ట, వెలుగు: గందమల్ల రిజర్వాయర్ పూర్తిచేసి ఆలేరును సస్యశ్యామలం చేస్తామన్న ఎమ్మెల్యే సునీత హామీ ఏమైందని ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య- ప్రశ్నించారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణ మాజీ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, మండల కోఆప్షన్ మాజీ సభ్యులు సయ్యద్ సలీంతో పాటు మరో 300 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీత దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు.
రెండు సార్లు గెలిచి తన ఆస్తులను పెంచుకున్నారే తప్ప ఆలేరును అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, ఎంపీపీ గందమల్ల అశోక్, వంగపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.