ప్రజాదీవెన సభను సక్సెస్ చేయండి: బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : నేడు ఆలేరులో నిర్వహించనున్న కాంగ్రెస్  ‘ప్రజాదీవెన’ బహిరంగ సభకు సక్సెస్ చేయాలని  కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ శ్రేణులతో  ర్యాలీగా వెళ్లి  నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా రానున్నట్లు చెప్పారు.

అనంతరం సాయిబాబా టెంపుల్ పక్కన నిర్వహించే ప్రజాదీవెన సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం  యాదగిరిగుట్ట మండలం మైలారుగూడెం, గణేష్ నగర్, అంగడి బజార్, రామాజీపేట, ఆలేరు మండలం కొలనుపాక, సాయిగూడెం, శారాజీపేట, బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్, గోవింద్ తండా, రాజాపేట మండలం నర్సాపూర్, పాముకుంట, కుర్రారం, తుర్కపల్లి మండలం వెంకటాపురం, కడీలబాయి నుంచి వెయ్యి మంది బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు కాంగ్రెస్‌‌లో చేరారు.