తెలంగాణలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం : బీర్ల అయిలయ్య

రాజాపేట, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. అయిలయ్యకు విప్‌ పదవి రావడంతో ఆయనను శనివారం రాజాపేట మండలానికి చెందిన సీపీఐ నాయకులు సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి  చేస్తానని మాటిచ్చారు.  ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులపై ఫోకస్‌ చేస్తామన్నారు. సీపీఐ మండల కార్యదర్శి చిరుర్ల లింగం, నాయకులు పోచయ్య, హేమలత, ఆదినారాయణ , కనకయ్య, హరినాథ్ పాల్గొన్నారు.