కాంగ్రెస్​తోనే మైనారిటీలకు న్యాయం : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : కాంగ్రెస్ పార్టీతోనే మైనారిటీలకు సరైన న్యాయం జరుగుతుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన 70 మంది ముస్లింలు శుక్రవారం యాదగిరిగుట్టలో బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదైతే.. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ది అని గుర్తుచేశారు. 

రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేశ్​ యాదవ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ సలాం, కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నర్సింహ్మ గౌడ్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్గుడ్ల నరేశ్​, మండల కార్యదర్శి ముక్కెర్ల వెంకటేశ్​, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.