యాదాద్రి, వెలుగు: ఐక్యమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం రాయగిరిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కులస్తులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కుల వృత్తిపైనే చాలామంది దృష్టి పెట్టడం వల్ల చదువు విషయంలో వెనుకబడ్డామని వాపోయారు. ఇప్పటికైనా పిల్లలను విద్యావంతులు చేయాలని ఆయన సూచించారు. ఈ మీటింగ్‌లో సంఘం నేతలు సుబ్బూరు బీరు మల్లయ్య, చీర శ్రీశైలం, గవ్వల నర్సింహులు, జూకంటి రవీందర్, కాదూరి అచ్చయ్య ఉన్నారు.