యాదగిరిగుట్ట, రాజాపేట, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగుల కోసం బిల్డింగ్ నిర్మించి ఇస్తానని - ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. బుధవారం ఆలేరులో నిర్వహించిన పెన్షనర్ల మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.
ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు. ఈ తర్వాత యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 12వ వార్డు, రాజాపేట మండలం రేణిగుంట, ఆలేరు మండలం శారాజీపేట, టంగుటూరు, తుర్కపల్లి మండలం గంధమల్ల, వీరారెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుందని, ఆ తర్వాత కూడా తహశీల్దార్, ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకలసుధా హేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, గౌలీకార్ అరుణ రాజేశ్, బబ్బూరి మౌనిక శ్రీధర్, మండల స్పెషలాఫీసర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.