కరీంనగర్ టౌన్, వెలుగు: 15 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు ఎంపికయ్యారని చైర్మన్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం స్కూల్ లో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
విద్యార్థులు అవనీ రెడ్డి, సుహర్ష్ స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, స్పోర్ట్స్ ఇన్‌చార్జి శ్రీకాంత్, కోచ్ సురేందర్ సింగ్, అనిల్ పాల్గొన్నారు.