విస్తరణకు రూ.1,300 కోట్లు.. బిర్లా నూ ప్రకటన

విస్తరణకు రూ.1,300 కోట్లు.. బిర్లా నూ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: పైపులు, రూఫ్ ​టాప్స్ ​వంటి బిల్డింగ్ ​మెటీరియల్ ​ప్రొడక్టులు తయారు చేసే బిర్లా నూ (గతంలో హెచ్​ఐఎల్​) విస్తరణ కోసం రాబోయే మూడేళ్లలో రూ.1,300 కోట్లు ఇన్వెస్ట్​ చేయనున్నట్టు ప్రకటించింది. 2028 నాటికి బిలియన్​డాలర్ల విలువైన కంపెనీగా ఎదగడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇందుకోసం కొత్త కంపెనీలను కొంటామని, కొత్త ప్రొడక్టులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. 

తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 32 ప్లాంట్లు ఉన్నాయని, ప్రస్తుతం ఐదు వేల రకాల ప్రొడక్టులను అమ్ముతున్నామని సీఈఓ అకాశ్​ సేఠ్ ​చెప్పారు. 2024లో రూ.3,375 కోట్ల రెవెన్యూ సాధించామని, ఈసారి రూ.ఐదు వేల కోట్ల రెవెన్యూను టార్గెట్​గా పెట్టుకున్నామని చెప్పారు.  హోమ్, ఇంటీరియర్ రంగంలో విస్తరించేందుకు తమ గ్లోబల్ ప్రీమియర్ బ్రాండ్ పారడార్‌‌‌‌ను జర్మనీ నుంచి భారత్‌‌కు తీసుకురాలని అనుకుంటున్నామని వెల్లడించారు.