ఆసిఫాబాద్ , వెలుగు: బిర్సా ముండా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బిర్సా ముండా 150 జయంతి పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో గిరిజన గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవల, ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శంకర్, డీపీఓ భిక్షపతి, శిశు సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిహార్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలని గుర్తు చేశారు.
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఉద్యమ వీరుడు, బిర్సాముండా జయంతి వేడుకలను ఆదిలాబాద్ టౌన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో, హీరాసుక ఆదివాసీ జాగృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. పట్టణంలోని బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర విభాగ్ ప్రచారక డీవీఎన్‌వి శివకుమార్, వనవాసీ కళ్యాణ పరిషత్ తెలంగాణ కార్యదర్శి ఆత్రం సతీశ్, హీరాసుక జాగృతి సమితి అధ్యక్షుడు సిడం రామ్ కిషన్, సమితి సభ్యులు, బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.