తొలి తెలుగు రచయిత్రి మొల్లమాంబ జయంతి

తొలి తెలుగు రచయిత్రి మొల్లమాంబ జయంతి

సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తేనెలొలికే అచ్చమైన తెలుగులో  రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుంది. తొలి తెలుగు రచయిత్రిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మొల్ల పదిలపరుచుకుంది. రామాయణాన్ని మహా మహా పండితులు  అనేకమంది రచించినప్పటికీ మొల్ల రామాయణానిది  విశిష్ట స్థానం. మహా మహా పండితులు సైతం మొల్ల రామాయాణాన్ని ప్రామాణికంగా ఉదహరిస్తూ ఉంటారు. కడప జిల్లా గోపవరంలో నిరుపేద కుమ్మరి వృత్తిదారుడైన కేశవ శెట్టి ఇంట్లో  14 వ శతాబ్దంలో జన్మించిన మొలమాంబ 1530 వరకు జీవించినట్టు  చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. 

చిన్నతనం నుండే దైవభక్తి రాముడి పట్ల తన భక్తిశ్రద్ధలను కనబరిచేది. రాముడిపై విపరీతమైన ఆరాధన భావాన్ని కలిగి ఉన్న  మొల్లమాంబ రామాయణాన్ని రచించింది . ఎంతో భక్తిభావం ఆరాధనభావంతో రచించిన మొల్ల రామాయణానిది ప్రత్యేకమైన శైలి.  శూద్రులకు చదువు నిరాకరించిన  నాటి  వ్యవస్థలో ఒక శూద్ర కుమ్మరి మహిళ రామాయణం రచించడం పట్ల నాటి బ్రాహ్మణీయ పండిత  వ్యవస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. .మొల్ల రచించిన అనేక తాళపత్ర గ్రంథాలను  ప్రజలే  భద్రపరిచినట్లు 

చారిత్రిక ఆధారాలు అనేకం ఉన్నాయి. నాటి  శ్రీకృష్ణదేవరాయలు సైతం మొల్ల రామాయణం రచించిన మొల్లమాంబను సన్మానించినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలు సైతం మొల్ల రామాయణం  రచన శైలి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా మొల్ల పాండిత్యానికి ప్రశంసలు అందించారు. అష్టదిగ్గజాలలో ముఖ్యుడైన వికటకవి తెనాలి రామకృష్ణ అనేక ప్రశ్నలకు మొల్ల చాకచక్యంగా సమాధానం చెప్పడంతో ఆశ్చర్యపోయిన తెనాలి రామకృష్ణ అంతటివాడు మొల్లకు పాదాభివందనం చేసినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి.కాకతీయుల సత్కారంకాకతీయ సామ్రాజ్యం  కూడా మొల్లకు  గజారోహణం చేయించి సత్కరించినట్లు చరిత్ర తెలియజేస్తుంది. 

కాకతీయ ప్రతాప రుద్రుడికి మొల్ల రామాయణాన్ని  అంకితం ఇవ్వాలని  తలంపు ఉండగా కాకతీయ పండిత వర్గం మాత్రం శూద్ర మహిళ రామాయణాన్ని వ్యతిరేకించారని చరిత్ర చెబుతోంది. ప్రతాప రుద్రుడు మాత్రం మొల్ల రామాయణం పట్ల ఆసక్తి కనబరిచారు. బహుశా మొట్టమొదటి తెలుగు రచయిత్రే కాకుండా తొలి శూద్ర రచయిత్రి కూడా మొల్లమాంబే. ఆమె రచనలపై పరిశోధన చేయాల్సిన  ఆవశ్యకత ఉంది.బహుజనవాదులం అని గొప్పలు చెప్పుకొనే సంఘాలు సైతం ఆమె జయంతి జరుపుకోక పోవడం వారి నిజాయితీని నిరూపిస్తుంది. మహా సాధ్వి  మొల్ల మాంబకు నివాళి. 

- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్