
జోగిపేట, వెలుగు : ఇటీవల ఆందోల్ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర్రాజనర్సింహా మంగళవారం తన బర్త్డే వేడుకలను కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. అల్మాయిపేట సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన వేడుకల్లో దామోదర్తో పాటు ఆయన కూతురు త్రిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
అందోల్ ప్రజలతో తమ కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. అనంతరం యువజన కాంగ్రెస్నాయకుడు జాకీర్ఆధ్వర్యలో జోగిపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాకూరి వెంకటేశం, కౌన్సిలర్శంకర్, నాయకులు ప్రవీణ్, నాని, దిలీప్, సరేందర్గౌడ్, అబ్బాస్ పాల్గొన్నారు.