- 8 మందిపై కేసు నమోదు
భద్రాచలం, వెలుగు : అర్ధరాత్రి రోడ్డుపై బర్త్డే వేడుకలు వద్దని చెప్పినా వినని యువకులపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాలను మంగళవారం సీఐ నాగరాజురెడ్డి మీడియాకు వెల్లడించారు. భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లో సోమవారం అర్ధరాత్రి దాటాక కొందరు యువకులు బర్త్ డే వేడుకలు రోడ్డుపై చేసుకుంటున్నారు. ఈ విషయమై పెట్రోలింగ్ పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు ఆటంకం కల్గించొద్దని సూచించారు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో కారుతో పాటు ఎనిమిది మంది యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. యువకులపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు.