నటుడిగానే కాదు నిర్మాతగానూ మెప్పించిన కళ్యాణ్ రామ్

నటుడిగానే కాదు నిర్మాతగానూ మెప్పించిన కళ్యాణ్ రామ్

అతనొక్కడే..

తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. నందమూరి వంశం నుంచి చాలా మంది హీరోలు వచ్చినా వారి ప్రభావం పడకుండా చూసుకుంటూ తనకంటూ ఓన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నటుడిగానే కాక నిర్మాతగానూ మెప్పించిన కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

"తొలిచూపులోనే" మూవీతో హీరోగా పరిచయం

1978 జూన్ 5న హరికృష్ణ, లక్ష్మీ దంపతులకు జన్మించాడు కళ్యాణ్​ రామ్.​కోయంబత్తూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లి ఇల్లినాయిస్ ఇన్ స్టిట్యూట్లో ఎం.ఎస్ చేశాడు. కళ్యాణ్ రామ్కు  నటుడు అవ్వాలనే కోరిక చిన్నతనం నుంచే ఉండేది. బాలకృష్ణ హీరోగా నటించిన బాల గోపాలుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2003లో 'తొలి చూపులోనే'  సినిమాతో కథానాయకుడిగా మారాడు. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత అభిమన్యు సినిమా చేసినా అంతగా మెప్పించలేకపోయాడు. మూడో సినిమా అతనొక్కడేతో కళ్యాణ్ రామ్కు బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతోనే నిర్మాతగా తొలి అడుగువేశాడు. 

నిర్మాతగా 9 సినిమాలు

డిఫరెంట్ కథలు ఎంచుకోవడం, ఏడాదికి ఒక్క మూవీనే చేయడంతో కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలమైనా కళ్యాణ్ రామ్ తక్కువ సినిమాలే చేశాడు. కమర్షియల్ సినిమాలు చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు ఆ ప్రయత్నం దెబ్బతిన్నా నటుడిగా అతని తపన అందరినీ ఇంప్రెస్ చేసింది. నిర్మాతగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికి 9 సినిమాలు నిర్మించాడు. అతనొక్కడే, హరే రామ్, జయీభవ, కత్తి, పటాస్, ఇజం సినిమాలతో పాటు రవితేజ హీరోగా కిక్ 2, తమ్ముడు ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రాన్ని నిర్మించాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఓం సినిమాకు ప్రత్యేక స్థానముంది. త్రీడీ ఫార్మాట్లో తీసిన తొలి ఇండియన్ యాక్షన్ మూవీ ఇదే కావడం విశేషం. ఓం మూవీని 5 కె రెజల్యూషన్లో తీశారు. అవతార్, ఫైనల్ డెస్టినేషన్ సినిమాలకు పనిచేసిన డేవిడ్ టైలర్.. ది అమేజింగ్ స్పైడర్ మేన్ కు వర్క్ చేసిన ఇయాన్ మార్కస్ వంటి గ్రేట్ టెక్నీషియన్లు మూవీ కోసం పని చేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా తీసినా విజయం మాత్రం దక్కలేదు. కానీ నిర్మాతగా కళ్యాణ్ రామ్ ధైర్యానికి, విజన్కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

తండ్రి పాత్రలో మెప్పించాడు

కళ్యాణ్ రామ్ నటించిన సినిమాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఎంతో ప్రత్యేకం. ఈ మూవీలో బాబాయ్ బాలకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. బయోపిక్లో బాలయ్య తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తే.. కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2006లో కళ్యాణ్ రామ్, స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. ప్రస్తుతం బింబిసార, డెవిల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో పీరియాడికల్ డ్రామా కాగా.. రెండోది ఒకటి ఫిక్షన్. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు పోషించి, డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే  కళ్యాణ్ రామ్.