
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ, హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో స్టేట్ షెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బిర్యానీ వర్సెస్ పులావ్ కార్యక్రమం నిర్వహించినట్లు చైర్మన్ రవీందర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీతో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
స్టూడెంట్లు 200 రకాల బిర్యానీ, పులావ్ వంటకాలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపాల్స్ అర్జున్‌రావు, కృష్ణమోహన్, స్టేట్ షెఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీన్, మెంబర్లు పాల్గొన్నారు.