అందుబాటులోకి క్విక్​ వైటల్స్​

హైదరాబాద్, వెలుగు:  ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ-ఆధారిత హెల్త్​ మానిటరింగ్​ యాప్ "క్విక్ వైటల్స్"ను ప్రారంభించినట్టు బిసామ్​ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. క్విక్ వైటల్స్ యాప్ స్టోర్,  ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఇది అధునాతన ఏఐ- పవర్డ్  మెషీన్ లెర్నింగ్ హెల్త్ మానిటరింగ్ అప్లికేషన్ అని కంపెనీ తెలిపింది.  హరీష్ బిసామ్ నాయకత్వంలో బిసామ్ ఫార్మా అభివృద్ధి చేసింది. 

ఈ యాప్ మన శరీరంలోని వివిధ కొలతలను సేకరిస్తుంది. ఇందులో శరీర బరువు, రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు, హృదయ స్పందన రేటు మొదలైనవి ఉంటాయి. కెమెరా ఆధారిత పరికరాలను ఉపయోగించి కాంటాక్ట్‌‌‌‌లెస్ స్పాట్ చెక్‌‌‌‌లు చేస్తుంది. పీపీజీ సెన్సర్‌‌‌‌లతో నిరంతరం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది.  యాప్ వార్షిక సబ్‌‌‌‌స్క్రిప్షన్ ప్లాన్‌‌‌‌లు రూ.1,200 నుంచి ప్రారంభమవుతాయి.