Viral video: అక్కా .. ఇదేం వంటకం .. బిస్కట్లతో పకోడీ ..

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదే కాబోలు. ఓ వ్యాపారి బుర్రకు తట్టిన ఐడియా.. ఆహార ప్రియులకు కొత్త రకం రుచిని పరిచయం చేసింది. అదే.. బిస్కట్ పకోడి..   ఓ మహిళ బిస్కట్లతో పకోడీలు  తయారుచేసి సోషల్ మీడియాలో హైలెట్ అయింది.  ‘అరె ఏంట్రా ఇదీ’.. మరీ బిస్కట్లతో పకోడీలు ఏంట్రా అని అనుకుంటున్నారా?  అయితే ఈ వీడియోపై ఓలుక్కేయండి. . .  .

చలికాలం వచ్చేసింది... సాయంకాలం వేళలో  వేడి వేడి టీతో కాస్తంతా పకోడీ తింటే ఆ మజానే వేరు.  పకోడి అంటే సాధారణంగా ఉల్లిపాయలతో చేస్తారు.. బ్రెడ్ పకోడి.. చికెన్ పకోడి  ఇలా రకరకాల వెరైటీ పకోడీలు చేసుకొని ఆరగిస్తుంటారు.  అయితే తాజాగా మరో కొత్తరకమైన బిస్కెట్  పకోడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.   అదేం పకోడి అనుకుంటున్నారా.. ఇది నిజమేనండి.. ఓ గృహిణి నిజంగానే బిస్కెట్లతో పకోడీ తయారు చేసింది. అంతే ఆమె బిస్కెట్ల పకోడీ వీడియో సోషల్ మీడియాలో కరోనా వైరస్‌ కంటే వేగంగా వైరల్‌ అయ్యింది. 

సోషల్ మీడియాలో వెరైటీ వంటకం వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Shayarcasm అనే యూజర్‌ పేరిట షేర్ చే అయింది. ఇందులో    ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో  ఓ మహిళ పకోడీలు తయారు చేయడం కనిపిస్తుంది. ఉడికిన బంగాళదుంపలను పేస్ట్ గా మార్చి.. దానిలో తాలింపు వేసి  కొంచెం ఎర్రగా వేగేలా బంగాళాదుంపల ఫ్రై తయారు చేస్తుంది.  తరువాత ఒక బిస్కట్ తీసుకొని దానిపై బంగాళదుంప ఫ్రై స్టఫ్ చేసి దానిపై మరో బిస్కెట్ ఉంచుతుంది.  ఇలా అన్ని బిస్కెట్లను చేసిన చేసిన తరువాత .. శనగపిండిని జారుగా చేసి అందులో ముంచి.. నూనెలో వేయిస్తుంది. 

 ఈ వీడియోకు లక్షల్లో వీక్షణలు, కామెంట్లు, లైకులు రావడంతో అదికాస్తా నెట్టింట వైరల్ అయ్యింది. నవంబర్ 3న షేర్ చేసిన ఈ 58 సెకన్ల నిడివి కలిగిన వీడియోలోని ఈ పకోడీ వంటకం చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో రకరకాల కామెంట్స్ చేస్తూ, మీమ్స్‌ పంపుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. పాపం ఈ పకోడీ ఎవరు తింటారో.. వారి ముఖం ఒకసారి చూడాలని ఉంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.