![నల్లమలలో అడవి దున్న హల్చల్.. 150ఏళ్ళ తర్వాత ప్రత్యక్షం..](https://static.v6velugu.com/uploads/2024/07/bison-appeared-in-nallamala-forest-after-150years_40o2kSVTjW.jpg)
అడవి దున్నను జియోగ్రఫీ ఛానల్ లోనో, జూ పార్క్ లోనో చూడటం తప్ప బయట ఎక్కడ చూసి ఉండరు చాలా మంది.అడవి దున్నలు విదేశీ అడవుల్లో విరివిగా కనిపించే అడవి దున్నలు మన అడవుల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే, ఇటీవల నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో అడవి దున్న ప్రత్యక్షమైంది.ఆత్మకూరు డివిజన్ బైరుట్లీ రేంజ్ ప్రాంతంలో అడవి దున్న తిరుగుతున్న దృశ్యాలు అటవీ అధికారులు గుర్తించారు.
150ఏళ్ళ తర్వాత నల్లమల ప్రాంతంలో అడవి దున్న కనిపించిందని అటవీ అధికారులు అంటున్నారు.1870లో నల్లమల ప్రాంతంలో అడవి దున్న ఆనవాళ్లు ఉండేవని అంటున్నారు అధికారులు. 150ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే జాతికి చెందిన అడవి దున్న కనిపించిందని అంటున్నారు అధికారులు. కర్ణాటక పశ్చిమ కనుమల నుండి నల్లమల దున్న వచ్చి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.