కౌంటింగ్ కేంద్రాలో అన్ని ఏర్పాట్లు చేయాలి : బిశ్వజిత్ దత్తా, సజ్జన్​ఆర్

  • ఎన్నికల పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్

నస్పూర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్​ఆర్ సూచించారు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజనీర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. కౌటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఎన్నికల విధులు కేటాయించబడిన ఆఫీసర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పని చేయాలన్నారు. ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ రహాలు, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సిడాం దత్తు, రాములు, ఏసీపీ తిరుపతి రెడ్డి, ఎన్నికల విభాగం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.