బిట్​ బ్యాంక్: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్: తెలంగాణలో భూదానోద్యమం

  •     నిజాం కాలంలో సర్ఫేఖాస్​ భూముల నుంచి నిజాం నవాబుకు ప్రతి ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది.
  •     1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను వినోబా భావేకు అప్పగించారు.
  •     మహాత్మా గాంధీని ప్రభావితం చేసిన ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్​.
  •     సర్​ జాన్​ రస్కిన్​ గ్రంథమైన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేశారు. 
  •     భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా ఉద్భవించాయి. 
  •     సర్వోదయ సమితి మొదటి సమావేశం 1949లో ఇండోర్​లో జరిగింది. 
  •     సర్వోదయ సమితి రెండో సమావేశం 1950లో ఒడిశాలోని అంగుల్​లో జరిగింది. 
  •     సర్వోదయ సమితి మూడో సమావేశం హైదరాబాద్​లోని శివరాంపల్లిలో జరిగింది. 
  •     సర్వోదయ సమితి మూడో సమావేశం 1951 ఏప్రిల్​ 8 నుంచి 11 వరకు జరిగింది. 
  •     శివరాంపల్లి గ్రామంలో జరిగిన సర్వోదయ సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా వినోబా భావే హాజరయ్యారు. 
  •     శివరాంపల్లిలో సర్వోదయ సమితి సమావేశం అనంతరం వినోబా భావే ఏప్రిల్​ 15న తెలంగాణ పర్యటనను ప్రారంభించారు.
  •     వినోబా భావే తెలంగాణ పర్యటనలో ఆయన వెంట నడిచిన ముఖ్య నాయకులు మర్రి చెన్నారెడ్డి, మేల్కోటే.
  •     1951 ఏప్రిల్​ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వినోబా భావే సమక్షంలో 100 ఎకరాలు భూమిని దానంగా ఇస్తున్నట్లు భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి ప్రకటించారు. 
  •     నల్లగొండ జిల్లా భువనగిరి తాలుకా పోచంపల్లిలో భూదానోద్యమం పుట్టింది. 
  •     భూస్వాములు తమ భూమిలో 1/ 6 వంతు భూమిని నిరు పేదలకు దానం చేయాలని వినోబా భావే సూచించారు. 
  •     వినోబా భావేకు తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుకా నాగిళ్ల గ్రామంలో ఒక పేద రైతుకు దానం చేశాడు.
  •     హైదరాబాద్​ స్టేట్​ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనం 1951, జూన్​ 7న ఆదిలాబాద్​ జిల్లా మంచిర్యాలలో జరిగింది. 
  •     దానంగా ఇచ్చిన భూమిని పంచడానికి ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951 జూన్​ 7న వినోభా బావే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. 
  •     భూదాన యజ్ఞసమితి కన్వీనర్​గా ఉమ్మెత్తల కేశవరావును నియమించారు. 
  •     భూదాన యజ్ఞసమితి సభ్యులుగా కేతిరెడ్డి కోదండరాంరెడ్డి, సంగం లక్ష్మీబాయిలను నియమించారు.
  •     1951 జూన్ 7న ఆదిలాబాద్​ జిల్లా మంచిర్యాలలో జరిగిన హైదరాబాద్​ స్టేట్​ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్​ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బి. రామకృష్ణారావు హాజరయ్యారు. 
  •     హైదరాబాద్​ రాష్ట్రం భూదానానికి సంబంధించిన చట్టాన్ని 1951లో ప్రకటించింది. 
  •     వినోబా భావే తెలంగాణలో తన మొదటి పాదయాత్రలో 12000 ఎకరాల భూమిని దానంగా పొందాడు.
  •     శంకర్​రావు దేవ్​ 1952లో మెదక్​ జిల్లాలో పర్యటించి 15 రోజుల్లో 4000 ఎకరాల భూమిని దానంగా పొందారు.
  •     1954లో తెలంగాణలో రెండు సార్లు పర్యటించిన కృష్ణదాస్​ జాజూ సర్వోదయ కార్యకర్తలకు ప్రేరణ కలిగించాడు.
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో జయప్రకాశ్​ నారాయణ 1952 ఆగస్టులో పర్యటించారు. 
  •     తెలంగాణలో వినోబా భావే భూదానోద్యమ రెండో యాత్ర 1955 డిసెంబర్ లో ఖమ్మం జిల్లా ముత్తుగూడెం నుంచి ప్రారంభమైంది. ఈయనకు హైదరాబాద్​ సీఎం బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ మొదలైన వారు స్వాగతం పలికారు. 

 చివరి నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ వినోబా భావే మొదటి భూదాన యాత్ర సందర్భంగా 3500 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు.