
1911లో కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశవదాసు పునాది వేశారు.
1913, డిసెంబర్ హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోనూ కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని రత్నమాంబదేశాయి అద్భుతమైన పద్యాలు రాసింది.
జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం, భూదానోద్యమం, సహకారోద్యమంలో కోదాటి నారాయణరావు ప్రధాన పాత్ర వహించారు.
కోదాటి నారాయణరావు నడిపిన పత్రికలు ప్రగతి, బాలసరస్వతి.
ఆంధ్రసారస్వత పరిషత్తును కోదాటి నారాయణరావు స్థాపించాడు.
పాశం నారాయణరెడ్డి చేసిన రచనలు దయానంద సరస్వతి జీవిత చరిత్ర (బుర్రకథ), త్యాగమూర్తులు, సదాశివరెడ్డి పద్య కావ్యం.
మిత్ర ధర్మం కోసం నిజాంను ఎదురించిన పాపన్నపేట సంస్థానాధీశుడు సదాశివరెడ్డి.
తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా స్థాపించబడ్డ మొదటి సాహిత్య సంస్థ సాహితీమేఖల.
1936లో సాహితీ మేఖల సంస్థను నల్లగొండలో వెంకటరత్న శాస్త్రి ప్రారంభించాడు.
సాహితీ మేఖల సంస్థ దాశరథి రంగాచార్య రచించిన అగ్నిధార, అంబడిపూడి వెంకటరత్నం రచించిన తర్క భాష, పున్నం అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక, పులిజాల గోపాలరావు రచించిన ఖడ్గతిక్కన గ్రంథాలు ప్రచురించింది.
1939లో సాధన సమితి అనే సంస్థను బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెలుదుర్తి మాణిక్యరావు స్థాపించారు.
1941 నవంబర్ 20న సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహిత్య సంస్థ విజ్ఞానవర్ధిని పరిషత్తు.
విజ్ఞానవర్ధిని పరిషత్తు ద్వారా ప్రచురితమైన సురవరం ప్రతాపరెడ్డి రచనలు రామాయణ విశేషాలు, మృత్యు సిద్ధాంతం, ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం.
1943, మే 26న తెలుగు భాషా వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్లో ఆవిర్భవించిన సంస్థ నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్.
నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ 1949 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ పేరుతో వ్యవహరించబడుతోంది.
నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రంగనాథరావు.
నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్‌కు అధ్యక్ష కార్యదర్శులుగా లోక్నంది శంకరనారాయణరావు, బిరుదు వెంకటరెడ్డి పనిచేశారు.
కావ్యాలంకార సంగ్రహాన్ని సూర్యనారాయణశాస్త్రి రచించారు.
సారస్వత వ్యాసముక్తావళిని బూర్గుల రామకృష్ణారావు రచించారు.
శాలివాహన గాథాసప్తశతిసారాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణశాస్త్రి రచించారు.
సాహిత్య సోపానాలు అనే గ్రంథాన్ని దివాకర్ల వెంకటావధాని రచించారు.
ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రచించారు.
ఆంధ్రుల చరిత్రను నెలటూరి వెంకటయ్య రచించారు.
కృష్ణశాస్త్రి రచనలు పల్లె పదాలు, స్త్రీల పౌరాణిక పాటలు.
మనదేశం అనే పుస్తకాన్ని దేవులపల్లి రామానుజరావు రచించారు.
వీరగాథలు అనే పుస్తకాన్ని గడియారం రామకృష్ణశర్మ రచించారు.
మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా మారింది.
నవ్య సాహితి సమితి సాహిత్య సంస్థను రావి నారాయణరెడ్డి స్థాపించారు.
కాళోజి నారాయణరావు స్థాపించిన సాహిత్య సంస్థ వైతాళిక సమితి.
గాంధీజీ హరిజనోద్ధరణ, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమాల ప్రభావంతో దళితుల మీద జొన్నలగడ్డ హన్మంతరెడ్డి పద్యాలు రచించారు.
జాషువా కంటే ముందు హిందూమత దాష్టీకంపై మండిపడ్డ కవి అరిగె రామస్వామి.
దళితులపై కవిత్వం రాయడమే కాకుండా వారి కోసం పాఠశాల కూడా నడిపిన కవి గంగుల శాయిరెడ్డి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆంధ్రకు వెళ్లిన తెలంగాణ వాళ్లను చీత్కరిస్తూ ఆదరాభిమానములు అనే కవితను ధవళా శ్రీనివాసరావు రచించారు.
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావ్ కొడుకో నిజాం సర్కరోడా అనే పాటను రాసి సాయుధ పోరాటాన్ని యాదగిరి ఉర్రూతలూగించారు.