కాకతీయులు
- సామంత కాకతీయుల్లో చివరివాడు మొదటి రుద్రుడు. ఇతనే స్వతంత్ర కాకతీయుల్లో మొదటివాడు.
- రెండో ప్రోలరాజు పెద్ద కుమారుడైన రుద్రదేవుడు 1158–1162 వరకు కల్యాణిచాళుక్యులకు సామంతుడిగా ఉన్నాడు.
- రుద్రదేవుడు కళ్యాణి చాళుక్యుల నుంచి క్రీ.శ.1162వ సంవత్సరంలో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు.
- రుద్రదేవుడు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని తెలంగాణలో మొదటిసారిగా 1163లో విశాల రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.
- ద్రాక్షారామం శాసనం వేయించిన రుద్రదేవుని మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి. ఈ శాసనం ప్రకారం రుద్రదేవుడు చాళుక్య చోళ రాజు రెండో రాజరాజుకు సమకాలీనుడు.
- హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ప్రకారం కరీంనగర్ నగనూర్ పాలకుడైన దొమ్మరాజు, పొలవాస పాలకుడైన రెండో మేడరాజు, మైలిగదేవుడు, చోడోదయుడులతో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు ఓడించాడు.
- రుద్రదేవుడి రాజ్య సరిహద్దులు ఉత్తరాన గోదావరి, పశ్చిమాన బీదర్, దక్షిణాన శ్రీశైలం.
- రుద్రదేవుడు అనుమకొండలో 1000 స్తంభాల గుడి నిర్మించాడు. ఇతనే ఓరుగల్లు కోటను నిర్మించాడు.
- 1195లో యాదవ రాజైన జైతూగి జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు.
- రుద్రదేవుని తర్వాత కాకతీయ రాజ్యాధికారాన్ని అతని తమ్ముడు మహాదేవుడు చేపట్టాడు.
- కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకాలోని సుండెల్ల గ్రామ శాసనం, వరంగల్ కోటలో లభించిన విరిగిన శాసనం మహాదేవునికి సంబంధించినవి.
- కాకతీయుల్లో అత్యంత పరాక్రమశాలి గణపతిదేవుడు. ఇతను 1199లో సింహాసనం అధిష్టించాడు.
- యాదవరాజు జైతుగి చెరసాల నుంచి గణపతిదేవుడిని రేచర్ల రుద్రసేనాని విడిపించాడు.
- గణపతిదేవుని కాలంలో కృష్ణానది ఉత్తర భాగమైన నేటి ఖమ్మం జిల్లా ప్రాంతం నతవాడి రాజుల పాలనలో ఉండేది.
- గణపతిదేవుడు తన కొలువులో గజసాహిణిగా నియమించిన పన్నచోడుని కుమారుడు జాయప. ఇతనిని గణపతిదేవుడు వెలనాడు పాలకునిగా నియమించాడు.
- గణపతిదేవుడు తన పరిపాలన చివరి దశలో యుద్ధం చేసిన మధుర రాజ్యాధిపతి పాండ్యరాజు.
- ముత్తకూర్ యుద్ధంలో గణపతిదేవుడు పరాజయం పొందాడు. ఇతనిని జటావర్మన్ వీర పాండ్యన్ ఓడించాడు.
- తన పూర్వీకులు ప్రారంభించిన ఓరుగల్లు నిర్మాణాన్ని గణపతిదేవుడు పూర్తిచేశాడు.
- గణపతిదేవుని అనంతరం కాకతీయ రాజ్యాధికారాన్ని రుద్రమదేవి చేపట్టింది.
- రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవులో అడుగుపెట్టిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో.
- కాకతీయుల అధికారాన్ని రక్షించే భారాన్ని స్వీకరించిన సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు.
- రుద్రమదేవి సింహాసనం అధిష్టించగానే ఆమెకు వ్యతిరేకంగా హరిహర, మరారిదేవులు తిరుగుబాటు చేశారు.
- రుద్రమదేవి పాలించే నాటికి కాకతీయ సామ్రాజ్యానికి పొరుగున ఉన్న రాజ్యాలు తూర్పు గాంగులు, యాదవులు, పాండ్యులు.
- రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యంపై దండెత్తిన యాదవరాజు మహాదేవుడు.
- యాదవరాజు మహాదేవునిపై రుద్రమదేవి విజయాన్ని వర్ణించే శాసనం బీదర్ కోటలో లభించిన రుద్రమదేవి శాసనం.
- రుద్రమదేవి యాదవరాజు మహాదేవునిపై సాధించిన చారిత్రాత్మక విజయానికి సూచికగా రాయగజకేసరి బిరుదును పొందింది.
- రుద్రమదేవికి అత్యంత సన్నిహితంగా ఉండి, చివరి కాలంలో ఆమెపై కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశాడు.
- నల్లగొండ జిల్లా చందుపట్ల గ్రామంలో లభించిన శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవుణ్ని అణచే క్రమంలో క్రీ.శ. 1289 నవంబర్ 27న మరణించింది.
- రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు.
- రుద్రమదేవి తన వారసునిగా ముమ్మడమ్మ కుమారుడు ప్రతాపరుద్రుడిని ప్రకటించింది.
- కాకతీయ పాలకుల్లో చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. ఇతను 1290లో సింహాసనం అధిష్టించాడు.
- అంబదేవుడిని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓడించాడు.
- అంబదేవుడు, అతని మిత్రులైన పాండ్య, యాదవ సేనలను ఎదుర్కోవడానికి ప్రతాపరుద్రుడు త్రిముఖ వ్యూహం అనుసరించాడు.
- త్రిపురాంతకం యుద్ధంలో కాకతీయ సైన్యాలు అంబదేవునిపై సాధించిన విజయానికి గుర్తుగా త్రిపురాంతకంలో కాకతీయ సేనాపతి ఇందులూరి అన్నయ్యదేవుడు శాసనం వేయించాడు.