- తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలోని నేలకొండ ప్రాంతాన్ని కందూరి చోడులు పాలించారు.
- కందూరి చోడుల వంశానికి చెందిన ముఖ్య కవులు గోకర్ణుడు, ఉదయాదిత్యుడు.
- కందూరి చోడులను తొలుత ఏరువ చోడులని పిలిచేవారు.
- నల్లగొండ దుర్గానికి ఏరువ సింహాసనం, ఏరువ పీఠమని పేరు.
- ఏరువచోడులు పాలించిన ప్రాంతం ఏరువనాడు.
- ఏరువచోడుల మొదటి రాజు ఏరువ మొదటి భీమదేవచోడుడు.
- ఏరువచోడులు కల్యాణీ చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా ఉన్నారు.
- ఏరువచోడులకు కందూరిచోడులు అనే పేరు కల్యాణీ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుడు నుంచి కందూరునాడును పొందినప్పటి నుంచి వచ్చింది.
- నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఏరువ మొదటి భీమదేవచోడుని రాజధాని.
- వైదంబులకు రేనాటి చోడులకు జరిగిన యుద్ధాల్లో ఓడి ఏరువ సీమకు వచ్చిన కందూరి చోడులు రాజ్యస్థాపన చేశారు.
- చోళులతో జరిగిన యుద్ధాల్లో సోమేశ్వరునికి ఏరువ భీముడి కుమారుడు ఏరువ మొదటి తొండయభీముడు తోడ్పడ్డాడు.
- కల్యాణీ చాళుక్య త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యునికి యుద్ధాల్లో తోడ్పడి కందూరు నాడును ఏరువ రెండో భీమదేవ చోడుడు పొందినవాడు.
- కాకతీయ మొదటి ప్రోలరాజుకు, రెండో బేతరాజుకు సమకాలీనుడు అయిన కందూరిచోడ రాజు రెండో తొండయచోళమహారాజు.
- వర్ధమానపురం (నేటి నాగర్‌కర్నూలు తాలుకాలోని వడ్డెమాను) రాజధానిగా కందూరునాడును ఉదయనుడు పాలించాడు.
- నల్గగొండ జిల్లాలోని పానగల్లు సమీపంలోని ఉదయ సముద్రాన్ని కందూరిచోడ రాజు ఉదయనుడు తవ్వించాడు.
- సంస్కృతంలో ఉదయాదిత్యాలంకారం అనే లక్షణ గ్రంథాన్ని కందూరిచోడ రాజు ఉదయనుడు రచించాడు.
- తుమ్మేటి గ్రామంలో భీమనది అనే కాలువను, మండగంటి గ్రామంలో గోకర్ణమనే కాలువను ఉదయనుడి కుమారులు నాలుగో భీముడు, రెండో గోకర్ణుడు తవ్వించారు.
- కందూరిచోడుల్లో చివరివాడు రామనాథ చోడుడు.
- కందూరి చోడులు మూసీ నది మీద నమిలె వద్ద ఆనకట్ట నిర్మించి కాలువలు తవ్వించారు.
- పెద్దదేవులపల్లి, ఆకారం చెరువు, గోకారం కాలువ చెరువు, కొప్పోలు చెరువు, శౌలిగౌరారం చెరువు, భీమసముద్రం వంటి అనేక గొలుసుకట్టు చెరువులను కందూరిచోడులు నిర్మించారు.
- కందూరిచోడుల కాలంలో గ్రామాల్లో ఉండే 18 రకాలైన వృత్తుల వారిని అష్టాదశ వర్ణాలు అని పిలిచేవారు.
- కందూరిచోడులు వైదిక మతస్తులు.
- కందూరిచోడుల కాలంలో ప్రజలు ఎక్కువగా శివుడిని ఆరాధించేవారు.
- నల్లగొండ జిల్లాలోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయాసోమేశ్వరాలయం, భువనగిరిలోని సోమేశ్వరాలయం, మామిళ్లపల్లిలోని నరసింహాలయం, కూడలి సంగమేశ్వరాలయాన్ని కందూరుచోడులు నిర్మించారు.
- కందూరుచోడులు నిర్మించిన కోటలు అనుముల, పానగల్లు, వాడపల్లి, వర్ధమానపురం, కందూరు, సిరికొండ, ఉండ్రుగొండ, ఉర్లుగొండ.
- కందూరుచోడులు 40 శాసనాలను వేయించారు.
- కందూరుచోడుల శాసనాలు తెలుగు, కన్నడ లిపుల్లో ఉండేవి.
- కందూరుచోడుల కాలంలో వచ్చిన తొలి పద్య శాసనం అనుముల శాసనం.
- ఆగామోతుకూరు శాసనంలో అచ్చమైన తెలుగు భాష కనిపిస్తుంది.
- గోకర్ణచందస్సును మొదటి గోకర్ణుడు రచించాడు.
- మొదటి గోకర్ణునికి సమకాలీనుడైన శాసనకవి త్రిపురాంతకుడు.