
- కాకతీయుల మొదటితరానికి చెందిన పాలకులు జైన మతం ఆచరించారు.
- ప్రోలరాజు అనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ఆరంభమైంది.
- ప్రతాపరుద్రుని కాలం నాటి జైన కవి అపయార్యుడు. ఇతను రచించిన గ్రంథం జినేంద్ర కళాభ్యుదయం
- తొలి కాకతీయులు కాలాముఖ శైవశాఖను ఆదరించారు.
- అనుమకొండ శాసనం ప్రకారం రెండో బేతరాజు శ్రీశైలంలోని మల్లికార్జున శిలా మఠం అధిపతి రామేశ్వర పండితుడి శిష్యుడు.
- కాళేశ్వరంలో శివలింగాన్ని రామేశ్వర పండితుడు ప్రతిష్ఠించాడు.
- కాకతీయుల కాలంలో తెలంగాణలోని కాలాముఖ శైవ క్షేత్రాలు ధర్మపురి (కరీంనగర్), అనుమకొండ (వరంగల్), ఐనవోలు (వరంగల్), పానగల్లు (నల్లగొండ), నిజామాబాద్, నందికంది(సంగారెడ్డి), శనిగరం (కరీంనగర్).
- గణపతి దేవుని గురువు ధర్మశిశుడు.
- గణపతిదేవుని కాలంలో పలు శైవగోళకీ మఠాలను స్థాపించి విశ్వేశ్వర శివదేశికుడు రాజగురువు స్థానం పొందాడు.
- రుద్రమదేవి గురువు విశ్వేశ్వర శివదేశికుడు.
- రుద్రమదేవి విశ్వేశ్వర శివదేశికునికి కృష్ణా నదీ తీరంలో ఉన్న మందర గ్రామం(దీన్నే విశ్వేశ్వర గోళకీమఠం అంటారు) దానంగా ఇచ్చింది.
- కాకతీయుల నాణేల మీద వరాహ లాంఛనం ఉండేది.
- రుద్రదేవుడు అనుమకొండలో త్రికూట రుద్రేశ్వర ఆలయం నిర్మించారు.
- రుద్రమదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు అనుమకొండలో ప్రసన్నకేశవస్వామి ఆలయం నిర్మించారు.
- గణపతిదేవుని సోదరి రాణి మైలాంబ గోపాలకృష్ణుడి దేవాలయాన్ని ఇనగుర్తిలో నిర్మించింది.
- కావేరి తీరంలోని శ్రీరంగనాథస్వామి ఆలయానికి సకలవీడు గ్రామాన్ని దానం చేసిన రెండో ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు.
- కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధ తెలుగు కవులు తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు, బద్దెన, కొలను గణపతిదేవుడు, రుద్రదేవుడు, ఏకామ్రనాథుడు, కాసె సర్వప్ప.
- కాకతీయుల కాలంనాటి తెలుగు రచనలు ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర దశకుమారచరితం, పురుషార్థసారం, జైనేంద్ర కళ్యాణాభ్యుదయం, పండితారాధ్యచరితం, బసవపురాణం, శివయోగసారం, నీతిసారం, నీతిసార ముక్తావళి, ప్రతాపరుద్రచరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం.
- రెండో తైలవరాజు(క్రీ.శ.973–995) కాలానికి చెందిన తొమ్మిది అడుగుల ఎత్తు, ఏడు తలల నాగరాజు నీడలో ఉన్న పార్శ్వనాథ విగ్రహం మెదక్ జిల్లా కుల్చారం గ్రామంలో లభించింది.
- కాకతీయుల కాలంలో నిర్మించిన కోటల్లో గోల్కొండ, రాచకొండ, భువనగిరి, ఓరుగల్లు ముఖ్యమైనవి.
- హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు1163 సంవత్సరంలో నిర్మించారు.
- వరంగల్ జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్పగుడిని క్రీ.శ.1213లో గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రదేవుడు నిర్మించాడు.
- జాయపసేనాని నృత్త రత్నావళిలో పేర్కొన్న రీతుల ప్రకారం శిల్పాలు పాలంపేటలోని రామప్పగుడిలో చెక్కబడ్డాయి.
- తురుష్కుల దాడిలో ధ్వంసమై ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న స్వయంభూలింగ దేవాలయం వరంగల్ కోటలో ఉంది.
- రెండో ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యంలో 5,500 శైవ ఆలయాలు, 1300 వైష్ణవ ఆలయాలు, మల్లారదేవుని 2,400 గుళ్లు, భైరవ, దుర్గ, గణపతిదేవుళ్లకు కలిపి 4,400 గుళ్లు ఉన్నట్లు ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర పేర్కొంటుంది.
- కాకతీయుల మంత్రి మండలిలో సభ్యులు ప్రధానులు, అమాత్యులు, ప్రెగ్గడులు, సామంతులు, దండనాయకులు.
- గణపతిదేవుని మహా ప్రధాని మల్యాల హేమాద్రిరెడ్డి.
- రెండో ప్రతాపరుద్రుని ప్రధాని ముప్పిడి నాయుడు.
- రాజు ప్రతిదినం విధిగా మంత్రులతో సమావేశమై వివిధ అంశాలు చర్చించే వాడని గణపతిదేవుని కాలానికి చెందిన శివదేవయ్య రాసిన గ్రంథం పురుషార్థసారంలో పేర్కొన్నారు.
- కాకతీయ ప్రభువులు రాజ్య వ్యవహారాలను 72 తరగతులు లేదా నియోగాలుగా విభజించారు.
- కాకతీయుల కాలంలో రాజ్య వ్యవహారాలపై అధిపతి నియోగాధిపతి.
- గణపతిదేవుని కాలంలో నియోగాధిపతి కాయస్థ గంగయసాహిణి.
- రుద్రమాంబ కాలంలో నియోగాధిపతిగా త్రిపురారి, పొంకమల్లయ్య ప్రగడ వ్యవహరించారు.
- కాకతీయుల కాలంనాటి కేంద్ర ప్రభుత్వంలో రాజు, మంత్రి మండలి, బహాత్తర నియోగాధిపతులు కీలక పాత్ర నిర్వహించారు.
- పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయులు తమ రాజ్యాన్ని స్థలం, సీమ, నాడు, భూమిగా విభజించారు.