
- ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం కోసం పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఢిల్లీ వేదికగా జరిగింది.
- స్వాతంత్ర్యం రాక ముందు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఒరిస్సా.
- దక్షిణాపథం అంటే తుంగభద్ర, నర్మదా నదుల మధ్య గల ప్రాంతం.
- అస్మక జనపదం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లింది.
- ప్రాదన్యపురం నగరాన్ని రాజధానిగా చేసుకొని అస్మక జనపదం విలసిల్లింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత జిల్లాలు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్.
- ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు చెర్మన్ ఎ.కె.ఆంటోని.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.
- 2009, డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు మొదటిసారిగా ప్రకటించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం కోసం 2013, సెప్టెంబర్ 11న పంపించారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే.
- తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన తేదీ 2014, మార్చి 1.
- తెలంగాణలోని జిల్లాల పునర్విభజన తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం–1974 ప్రకారం జరిగింది.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం జరిగింది.
- తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలు బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర.
- తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 119.
- తెలంగాణ రాష్ట్ర చిత్రపట ఆకారం సమద్విబాహు త్రిభుజం.
- హైదరాబాద్ సంస్థానంలో పర్షియా భాష స్థానంలో అధికార భాషగా ఉర్దూను 1884లో ప్రవేశపెట్టారు.
- ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను 2014, జులై 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు.
- ఖమ్మం జిల్లాలోని 327 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు.
- ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు.
- ఖమ్మం జిల్లాలోని రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు.
- ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం ద్వారా 2.76 లక్షల హెక్టార్ల వైశాల్యం కలిగిన భూభాగాన్ని తెలంగాణ కోల్పోయింది.
- ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం 2,17,157 హెక్టార్ల అటవీ వైశాల్యం కోల్పోయింది.
- తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం హైదరాబాద్.
- తెలంగాణ కశ్మీర్‌గా ఆదిలాబాద్ జిల్లాను పిలుస్తారు.
- జైలు మ్యూజియాన్ని తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
- గేట్ వే ఆఫ్ తెలంగాణ అని సూర్యాపేట జిల్లాను పిలుస్తారు.
- పూర్వం వికారాబాద్ జిల్లాను గంగవరం అని పిలిచేవారు.
- ఎండుమిర్చి, పత్తి కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయంమార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ వరంగల్ జిల్లాలో ఉంది.
- సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం కొత్తగూడెం జిల్లాలో ఉంది.
- గార్ల ప్రాంతంలో ప్రతి సంవత్సరం దసరా రోజున జాతీయ జెండాను ఎగురవేస్తారు.
- తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకొనే రాష్ట్రాలు నాలుగు.
- తెలంగాణలోని అతి తక్కువ జిల్లాలతో ఛత్తీసగఢ్ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది.
- అత్యధిక జిల్లాలతో మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటోంది.
- ఛత్తీస్ గఢ్‌తో సరిహద్దు పంచుకునే తెలంగాణ జిల్లాలు కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి.
- తెలంగాణ రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లాల సంఖ్య 15.
- తెలంగాణ రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగిన మొత్తం జిల్లాల సంఖ్య 18.
- మహారాష్ట్ర సరిహద్దును పంచుకొనే జిల్లాల సంఖ్య 7.
- కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ రాష్ట్ర జిల్లాలు 5.
- ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకునే తెలంగాణ జిల్లాల సంఖ్య 7.
- ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును పంచుకునే జిల్లాల సంఖ్య 3.
- సోలామైన్ అనే ప్రాంతం దక్కన్ పీఠభూమిలో అతి ఎత్తయినది. అయినా ఇది తెలంగాణలోని జనగాం జిల్లాలో ఉంది.