
తెలంగాణ శీతోష్ణస్థితి ఆయనరేఖ, రుతుపవన శీతోష్ణస్థితి రకానికి చెందింది.
రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి.
ఒక ప్రాంత శీతోష్ణస్థితి ఉష్ణోగ్రత, అవపాతం, ఆర్ధ్రతలపై ఆధారపడి ఉంటుంది.
శీతాకాలంలో తెలంగాణలో పశ్చిమం
నుంచి తూర్పునకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
రాష్ట్రంలో సీలేరు బేసిన్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.
తెలంగాణలో అత్యధిక వర్షపాత అస్థిరత్వం కలిగిన ప్రాంతం దక్షిణ తెలంగాణ.
తెలంగాణ ప్రాంతం అర్ధశుష్క వర్షపాత ప్రాంతంలో విస్తరించి ఉంది.
తెలంగాణ ప్రాంత వార్షిక సాధారణ వర్షపాతం 906 మీ.మీ.
తెలంగాణలో అతి తక్కువ వర్షపాత అస్థిరత్వం కలిగిన ప్రాంతం ఉత్తర తెలంగాణ.
రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే జిల్లా ఆదిలాబాద్.
తెలంగాణలో అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా గద్వాల్.
వేసవిలో తెలంగాణలో సాయంత్రం కురిసే వర్షాలు ఉష్ణమండల చక్రవాతాలు రకానికి చెందినవి.
అక్టోబర్ నెలను వర్షాకాలానికి, శీతాకాలానికి సంధి మాసంగా పేర్కొంటారు.
నైరుతి రుతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్.
శీతాకాలం డిసెంబర్ నుంచి మార్చి వరకు.
ఈశాన్య రుతుపవనకాలం అక్టోబర్ నుంచి నవంబర్.
తెలంగాణలో వేసవిలో కురిసే సంవహన వర్షపాతాన్ని తొలకరి జల్లులు అని పిలుస్తారు.
తెలంగాణలో ఈశాన్య రుతుపవన కాలంలో అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం నల్లగొండ.
నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతం అధిక వర్షపాతాన్ని పొందుతుంది.
నైరుతి రుతుపవన కాలంలో నల్లగొండ ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం పొందుతుంది.
ఈశాన్య రుతుపవన కాలంలో అల్ప వర్షపాతం పొందే జిల్లా ఆదిలాబాద్.
తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లా ఆదిలాబాద్.
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రామగుండం.
మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ సముద్రమట్టం నుంచి అధిక ఎత్తులో విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే చల్లగా ఉంటుంది.
తెలంగాణలో పర్వతీయ వర్షపాతం రకానికి చెందిన వర్షపాతం అధికంగా సంభవిస్తుంది.
హైదరాబాద్ ప్రాంతం వేసవిలో మిగతా ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్.
వర్షాకాలంలో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్.
చలికాలంలో తెలంగాణ సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్.
వేసవికాలపు తెలంగాణ రాష్ట్ర సగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్.
నైరుతి రుతుపవన కాలంలో తెలంగాణ మొత్తం వర్షపాతంలో 80 శాతం సంభవిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాత విస్తరణ దక్షిణం నుంచి ఉత్తరం వెళ్లే కొద్దీ పెరుగుతుంది.
ఈశాన్య రుతుపన కాలంలో తెలంగాణలో 20 శాతం వర్షపాతం కురుస్తుంది.
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్రామ్.
ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతం వడిహల్ఫా.
ఈశాన్య రుతుపవన కాలంలో తెలంగాణలో కురిసే వర్షపాతం 129 మీ.మీ.
భారతదేశ సాధారణ సగటు వర్షపాతం 117 సెం.మీ.
తెలంగాణలో అధిక వర్షపాతం జులై నెలలో సంభవిస్తుంది.
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉన్న ప్రాంతం రామగుండం.
దేశంలో అత్యంత చిత్తడి ప్రాంతం మాసిన్రామ్.
దేశంలో అత్యంత పొడి ప్రాంతం జైసల్మేర్.
భూ ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్.
ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు.
ఒక రోజులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలు.
భూమి మీద నమోదయ్యేందుకు అవకాశం ఉన్న అత్యల్ప ఉష్ణోగ్రత – 27 డిగ్రీల సెల్సియస్.
దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది.
దేశంలో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం గంగానగర్.